చంద్రబాబు, కోడెల అంతిమ యాత్రలో బాగానే నటించారు.. కానీ ఓ వ్యక్తి మీద నిజంగానే ప్రేమ ఉంటే.. యాత్రకు వచ్చిన వారికి నమస్కారం చేస్తారు.. లేదా మౌనంగా ఉంటారు.. కానీ రెండు వేళ్లు చూపడం ఏం సంస్కారం అని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోడెలను పిలిపించుకుని.. మీ కుమారుడి వల్ల చెడ్డపేరు వస్తోంది.. అదుపులో పెట్టుకొండి అని వార్నింగ్ ఇవ్వడం.. అందుకు కోడెల మీ పుత్రరత్నం వజ్రమా అని కోడెల చంద్రబాబును ప్రశ్నించడం నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందంటూ బాధపడుతున్నారు.. కానీ దానికి ఆజ్యం పోసిందే చంద్రబాబే కదా అన్నారు.
తమ జాతి ఉద్యమానికి.. తమపై అక్రమ కేసులు పెట్టించి.. ఈ రోజు వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది అణాగారిని వర్గాలకు వెలుతురు ఇవ్వడం కోసమే కానీ అణచివేయమని కాదంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.