బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్న సీఎం కెసిఆర్.

0
37

మహిళలకు సోమవారం నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. 28న వేడుకలు ప్రారంభం కానుండడంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేసేందుకు నిర్ణయించింది. ఈమేరకు గ్రామాల వారీగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. రంగురంగలు చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.  తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలకు ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడేళ్లగా సర్కారు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మండలాల వారీగా పంపిణీ చేసేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

జిల్లాలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకు చీరలు పంపిణీ చేస్తాం. మొత్తం 6,65,686 మందికి  అందజేస్తాం. ఇప్పటి వరకు జిల్లాకు 3,58,600 చీరలు వచ్చాయి. మిగతావి త్వరలో రానున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి బతుకమ్మ చీరల పంపిణీని విజయవంతంగా  పూర్తి చేస్తాం. మొయినాబాద్, కందుకూరు మండలం కొత్తూరులో ఉన్న గోదాంల నుంచి చీరలను ఆయా మండలాలకు తరలిస్తాం. రేషన్‌  దుకాణాల వద్ద బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.