ఏపీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ల ప్రసారాల నిషేధంపై దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం విచారించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ, ట్రాయ్ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హాజరయ్యారు. కౌంటర్ దాఖలుకు అడిషనల్ సోలిసిటర్ జనరల్ మరింత సమయం కోరడంతో.. ఈనెల 30 వరకు సమయం ఇస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
రాష్ట్రంలో ఛానళ్ళ నిలిపివేతపై హైకోర్టు స్పందించింది. ఏపీలో కొంత కాలం క్రితం ప్రముఖ న్యూస్ ఛానళ్ళు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ప్రసారాలను నిలిపివేసిన విషయం విదితమే. ఈ చర్యపై రెండు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఛానళ్ళ నిలిపివేతను సవాలు చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేలా కథనాలు ప్రసారమవుతున్నాయన్న కారణంతో ఛానళ్ళను నియంత్రించడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.