మద్యం దుకాణాల కోసం క్యూ కట్టిన దరఖాస్తుదారులు.

0
55

రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 41 వేల దరఖాస్తులు ఎక్సైజ్ శాఖకు అందాయి. దుకాణాల కేటాయింపుల కోసం శుక్రవారం ‘డ్రా’ నిర్వహించనున్నారు. 2019-21 సంవత్సరానికిగాను ఈ కేటాయింపులు జరగనున్నాయి. మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో ముగిసింది. చివరి మూడు రోజుల్లో దరఖాస్తుదారులు క్యూ కట్టారు. ప్రత్యేకించి హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లోని 173 దుకాణాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. విశేషమేమిటంటే… మద్యం వ్యాపారంతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు ఈ దఫా దుకాణాల కోసం క్యూ కట్టడం. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో… దుకాణాల కోసం 825 దరఖాస్తులొచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 2,216 వైన్ షాపుల కేటాయింపునకుగాను ఈ నెల ఒకటిన నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. కాగా గత ఎక్సైజ్ సంవత్సరంలో వైన్ షాపుల కోసం దరఖాస్తుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 410 కోట్లు కాగా… ఈ దఫా ఆదాయం రెట్టింపవుతుందని భావిస్తునా్న్నారు. కాగా వైన్ షాపుల ఏర్పాటులో స్థానికేతరులకు అవకాశమవ్వొద్దంటూ హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో ఇప్పటికే మద్యం వ్యాపారంలో ఉన్న వారు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. దీంతో హైదరాబాద్‌లోని బండ్లగూడలోని ఎక్సైజ్ కౌంటర్ల వద్ద చివరి రోజైన బుధవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారులు పోలీస్ శాఖ సహకారాన్ని కోరాల్సి వచ్చింది.