నిబంధనలకు విరుద్ధంగా స్టేజి క్యారీయింగ్‌ చేస్తున్న బస్సుల సీజ్‌

0
46

నిబంధనలకు విరుద్ధంగా తిరిగే ప్రైవేటు బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా ఉన్నాయని రవాణా శాఖ గుర్తించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్టేజి క్యారీయింగ్‌ చేస్తున్న ప్రైవేటు బస్సులను రవాణా శాఖ బుధ, గురువారాలు తనిఖీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న 23 స్టేజీ క్యారీయింగ్‌ బస్సులను రవాణా శాఖ సీజ్‌ చేసింది. వీటిలో జేసీ కుటుంబానికి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌వి 8 బస్సులున్నాయి. స్టేజీ క్యారీయింగ్‌ అనుమతి పొందిన ప్రైవేటు ఆపరేటర్లు రవాణా శాఖ నుంచి పర్మిట్లు తీసుకుని బస్సులను నడుపుతున్నారు. వీరు, రవాణా శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఆ బస్సులను తిప్పాల్సి ఉంటుంది.

దివాకర్‌ ట్రావెల్స్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్టేజీ క్యారీయింగ్‌ చేసే ప్రైవేటు బస్సులను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సిందిగా రవాణా శాఖ కమిషనర్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్టేజీ క్యారీయింగ్‌ చేస్తున్న బస్సులను తనిఖీ చేసిన అధికారులు 23 బస్సులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించి, వాటిని సీజ్‌ చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులలో ఓవర్‌ లోడింగ్‌, నిర్ణీత సమయాలు పాటించకపోవటం, అధిక ధరలు వసూలు చేయటం, ఓనర్‌షి్‌పను సూచించకపోవటం వంటి లోపాలను గుర్తించారు.