అఖిలప్రియ భర్తను అరెస్ట్ చేసేందుకు పోలీసులు హల్‌చల్.

0
55

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటివద్ద ఏపీ పోలీసులు హల్‌చల్ చేశారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు చేరుకున్నారు. అయితే పోలీసుల వద్ద ఎలాంటి సెర్చ్ వారెంట్ లేదని, వారెంట్ లేనప్పుడు ఇంట్లోకి ఎలా వస్తారని అఖిప్రియ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. కర్నూలు ఎస్పీ వ్యక్తిగతంగా తీసుకుని, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిపై తాము కూడా కేసు పెడతామని అఖిల ప్రియ అన్నారు. పోలీసులు తమ పక్కింటికి వెళ్లి అక్కడి నుంచి గోడ దూకి తమ ఇంట్లోకి ప్రవేశించారని, ఇదేం విధానమని అఖిల ప్రియ ప్రశ్నించారు. ఇంట్లో సమాన్లు పగులగొట్టి నానా హంగామా సృష్టించారన్నారు.