కమ్మనైన అమ్మభాషకు కష్టాలు..

0
39

కమ్మనైన అమ్మభాషకు కష్టాలు ఎదురవుతున్నాయి. మాతృభాషలో చదువు కనుమరుగవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మనవాళ్లు ఇంగ్లిషుపై మక్కువ ప్రదర్శిస్తూ.. తెలుగు భాషకు దూరమవుతున్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో చదువుతోనే విద్యార్థులు మానసిక వికాసం పొందే అవకాశం ఉందని తెలిసీ.. దానిని విస్మరిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే తెలుగు మీడియంను కాదని.. ఇంగ్లిషు మీడియంలో చదివేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తెలుగు మీడియం తిరోగమన దిశలో పయనిస్తోంది. తెలుగు మీడియం విద్యాసంస్థలు ఏటేటా తగ్గిపోతూ.. ఇంగ్లిషు మీడియం విద్యాసంస్థలు పెరిగిపోతున్నాయి. పాఠశాల స్థాయి మొదలుకొని.. డిగ్రీ వరకు 65 శాతానికి పైగా విద్యార్థులు ఇంగ్లిషు మీడియంలోనే చేరుతున్నారు. తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థులు 25ు లోపే ఉంటున్నారు. మున్ముందు ఈ సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు మీడియం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.