కడప కోర్టుకు హాజరైన బండ్ల గ‌ణేష్‌..! 14 రోజుల రిమాండ్‌.

0
46

న‌టుడిగా, నిర్మాత‌గా తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన బండ్ల గ‌ణేష్‌కు కడప కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. నవంబర్ 4 వరకూ ఆయన రిమాండ్ కొనసాగనుంది. గురువారం ఆయన కడప కోర్టుకు హాజరయ్యారు. బండ్ల గణేష్‌ఫై కడప జిల్లా మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు. కానీ గత కొంతకాలంగా ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. 2011లో కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 13 కోట్ల అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బండ్ల గణేష్‌పై 2013లో మహేష్ చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. దీంతో కడప పోలీసులు బండ్ల గణేష్‌పై కేసులు నమోదు చేశారు. కోర్టుకు హాజరుకాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాగా.. గతంలో కూడా బండ్ల గణేష్‌పై తెలుగు రాష్ట్రాల్లో  పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత పీవీపీతో పాటు ముంబైకి చెందిన ఫైనాన్సియర్ ఒకరు బండ్ల గణేష్‌పై కేసు నమోదు చేశారు.