తెలుగు సినీ పరిశ్రమలో మరో విశాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ సినీ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. తెలుగుతో పాటు తమిళ,మలయాళ,హిందీ చిత్రాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు.బాల నటిగా సినీ రంగంలో ప్రవేశించిన ఆమె.. 1960లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామ కళ్యాణం’ సినిమాలతో సీత పాత్రలో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ సినిమాలోని సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ సినిమాలో ఎన్టీఆర్ రావణుడిగా నటిస్తే.. హరనాథ్ శ్రీరామచంద్రుడిగా అలరించాడు. ఈ సినిమాతో నటిగా గీతాంజలి నట ప్రస్థానం మొదలైంది. గీతాంజలి అసలు పేరు మణి. ‘పారస్‌మణి’అనే హిందీ చిత్రంలో నటించేటపుడు ఆ చిత్ర సంగీత దర్శకులు సూచన మేరకు ఆ పేరును గీతాంజలిగా మార్చారు. అప్పటి నుంచి మణి కాస్తా గీతాంజలి అయింది.
గీతాంజలి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. 1947లో జన్మించిన గీతాంజలి.. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో చదివిన గీతాంజలి.. చిన్నతనంలో మంచి నృత్యకారిణిగా పేరు తెచ్చుకున్నారు. అక్క ప్రభావంతో ఆమె కూడా నాట్యం నేర్చుకుని ఎన్నో వేదికలపై ప్రదర్శనలిచ్చారు.బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తన 13వ ఏట హీరోయిన్ అయింది. కెరీర్ తొ లినాళ్లలో హీరోయిన్‌గా చేసిన ఆమె.. జానపద కథనాయికిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత ‘భాయ్’, గ్రీకు వీరుడు’ తదితర చిత్రాల్లో బామ్మ పాత్రలు వేసారు. చివరిసారిగా తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కిన దటీజ్ మహాలక్ష్మీ చిత్రంలో నటించారు. ఆమె తన సహనటుడు రామృకృష్ణను ప్రేమ వివాహాం చేసుకున్నారు. వీరికి ఆదిత్ శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నారు. ఈయన ‘భామా’ అనే తెలుగు చిత్రంలో నటించాడు. ఎన్టీఆర్‌ను గురువుగా భావించే గీతాంజలి ..2009లో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత పలు నంది అవార్డు కమిటీల్లో సభ్యురాలిగా పనిచేసింది.