సీతాఫలం తింటే ఆరోగ్యానికి హాని చేస్తుందా? లేక మేలుచేస్తుందా?

0
177

సీతాఫలంలో పుష్కలంగా పోషకాలుంటాయి. విటమిన్ సీ, ఏ, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ మనకు ఎంతో ఆరోగ్యకరం. శీతాకాలంలో ఎక్కువగా లభించే సీతాఫలాల్ని మిస్సవకుండా తినాలి. మన రోజువారీ డైట్‌లో వాటిని చేర్చుకోవాలి. మిస్సవకుండా తినాలి. ఐతే… సీతాఫలం అనగానే చాలా మంది రకరకాల అపోహలు ప్రచారం చేస్తున్నారు. వాటిని తింటే జలుబు చేస్తుందని కొందరు, షుగర్ వ్యాధి వస్తుందని మరికొందరు… ఇలా ఎన్నో రకాల అపోహలు. ఇలాంటివి వింటే… అమ్మో… వద్దులే తినకపోతేనే బెటర్ అని అనుకునే ప్రమాదం ఉంటుంది. నిజానిజాలు తెలియనంతవరకూ ఈ భ్రమలు పోవు. కానీ… తినకపోతే ఎన్నో పోషకాల్ని మనం మిస్సవుతాం కాబట్టి… అపోహల సంగతి తెలుసుకోవాల్సిందే.

సీతాఫలం అనేది ఓ అద్భుతమైన ఫలం. లక్కీగా మన దేశంలో ఎక్కువ మొత్తంలో ఈ పండ్లు లభిస్తున్నాయి. ఇంత మంచివాటిని తినడం మానేసి అడ్డమైన అపోహలు ప్రచారం చేసేవాళ్లతో ఇబ్బందే. అన్ని వయసులవారూ సీతాఫలం తినవచ్చు. ఇవి మన స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తాయి. జుట్టును పట్టుగా చేస్తాయి. కంటి చూపును పెంచుతాయి. మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇందులో పెద్ద మొత్తంలో బయో యాక్టివ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవి అధికబరువు, డయాబెటిస్, కాన్సర్ వంటి వాటితో పోరాడతాయి. కాబట్టి… అన్నీ మర్చిపోయి హాయిగా సీతాఫలం తినండి అంటున్నారు డాక్టర్లు.