విశాఖ లోక్‌సభ బరిలో బాలకృష్ణ చిన్నల్లుడు ??

0
31

సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్.. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుందని తెలిపారు.

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన తాజాగా స్పందించారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. తన తాత ఆశయాలను కొనసాగించేందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, పార్టీ ఆదేశిస్తే టీడీపీ తరపున విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తానని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారని శ్రీభరత్ అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేయగల సమర్ధత కలిగిన నాయకుడు చంద్రబాబే అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. శ్రీభరత్ రాజకీయాల పై ఆసక్తి చూపిస్తుండటంతో టీడీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, శ్రీభరత్ వివాహం 2013లో జరిగింది.