సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికిన రాజశేఖర్.

0
29

ఏపీలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. విపక్షాలు ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తెలుగు భాషకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి సినీనటుడు రాజశేఖర్ మద్దతు పలికారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైందే అని రాజశేఖర్ అన్నారు.

ఆధునిక ప్రపంచంలో ఉద్యోగాలు పొందాలన్నా, ఇతరులతో సంభాషించాలన్నా ఇంగ్లిష్ భాషే ముఖ్యమని అన్నారు. ఇంగ్లిష్ రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు తమ ఉన్నత చదువుల్లో, ఉద్యోగాలు తెచ్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని రాజశేఖర్ అన్నారు. ఇలాంటి ఈ సమస్యలకు జగన్ తీసుకున్న నిర్ణయం ముగింపు పలుకుతుందని హీరో రాజశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు.