రామ్ చరణ్‌కు వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి.

0
49

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి  ఇద్దరు బడా మాస్ హీరోలతో.. అదీ చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దురు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విషయంలో రాజమౌళి.. రామ్ చరణ్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.  ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ ఒప్పుకునేటపుడు ఎన్టీఆర్, చరణ్‌లకు రాజమౌళి ఒక కండిషన్ పెట్టాడు. ఆ ఒప్పందాన్ని ఎన్టీఆర్ పాటిస్తూ ఉండగా.. రామ్ చరణ్ మాత్రం ఉల్లంఘిస్తూ వస్తున్నాడు. ఈ సినిమా స్టార్ట్ చేసేముందు మీడియాకు సినిమా ఫంక్షన్స్‌కు దూరంగా ఉండమని జక్కన్న తారక్, చెర్రీలకు చెప్పినట్టు సమాచారం.

‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు చరణ్ కు అదేవిధంగా జూనియర్ కు తాను పెట్టిన ఒక కండిషన్ చరణ్ కు రాజమౌళి గుర్తుచేసినట్టు సమాచారం. ఇక జక్కన్న పెట్టిన కండిషన్ ను తూచా తప్పకుండ జూనియర్ పాటిస్తూ ఉంటే రకరకాల కారణాల వంకతో చరణ్ ఆ కండిషన్ ను బ్రేక్ చేసిన విషయాన్ని రాజమౌళి చిన్నగా చరణ్ దృష్టికి తీసుకు వచ్చినట్లు టాక్. ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యేముందు మీడియాకు అదేవిధంగా ఫంక్షన్స్ కు దూరంగా ఉండమని తాను చరణ్, జూనియర్లకు సూచించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసారు. తండ్రి చిరుతో నిర్మించిన సైరా విషయంలో రామ్ చరణ్.. రాజమౌళి నుంచి పర్మిషన్స్ తీసుకొని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా రామ్ చరణ్.. తరుచు మీడియా కంటపడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ విషయంలో రామ్ చరణ్‌కు రాజమౌళి కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం.