మీడియాను చూసి పరుగులు పెడుతున్న స్టార్ హీరోస్..

0
69

ఎందుకో తెలియదు కానీ మీడియాను చూస్తే సినిమా వాళ్లకు కాస్త తెలియని కంగారు అయితే కచ్చితంగా పుడుతుంది. తప్పు చేసినా చేయకపోయినా కూడా కెమెరా కనిపించగానే అలెర్ట్ అవుతుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి వింత ఘటనే జరిగింది. తాజాగా ఓ స్టార్ హీరో గ్యాంగ్ మీడియాను చూసి పరుగులు లంకించుకున్నారు. అది కూడా ఆ స్టార్ హీరో స్వయంగా మీడియా ముందే తనకు జరిగిన ఈ వింత ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. అతడే ఒన్ అండ్ ఓన్లీ విశాల్.. తెలుగు కుర్రాడే అయినా కూడా తమిళనాట సంచలనాలు సృష్టిస్తున్నాడు ఈ హీరో.

వరస సినిమాలతో పాటు విజయాలు కూడా అందుకుంటూ రచ్చ చేస్తున్నాడు. దానికితోడు సినిమా రాజకీయాల్లోనూ సత్తా చూపిస్తున్నాడు. పేరుకు తమిళ హీరో అయినా కూడా ఈ హీరోకు తెలుగులోనే ఎక్కువ స్నేహితులున్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఫ్రెండ్స్‌తో హ్యాంగ్ ఔట్ అవుతుంటాడు విశాల్. అలాగే ఈ మధ్య ఓసారి స్నేహితులంతా కలిసి పబ్‌లో కలిసామని చెప్పాడు విశాల్.