సురేశ్ రెడ్డి అక్రమాస్తులు పై ఏసీబీ అధికారుల దాడులు.

0
46

అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేశ్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి. ప్రస్తుతం పంచాయతీరాజ్‌లో ఏఈఈగా పని చేస్తున్న సురేశ్ రెడ్డి వద్ద రూ. 3 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలోనే సురేశ్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. సురేశ్ రెడ్డి చాలాకాలం జేసీ దివాకర్ రెడ్డి వద్ద పీఏగా పని చేయడంతో… ఆయనపై ఏసీబీ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్లలోని సురేశ్ రెడ్డి బంధువుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.