ఏపీ సీఎం జగన్ అమరావతిపై కీలక నిర్ణయం.

0
35

ఏపీ సీఎం జగన్ అమరావతిపై ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పరిధిలో నిలిచిపోయిన నిర్మాణాలపై సమీక్ష్ నిర్వహించిన జగన్… అమరావతి ప్రాంతంలోని రోడ్లకు, సగంలో నిలిచిపోయిన నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఆర్డీయే అధికారులను ఆదేశించారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు కూడా అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని తెలిపారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో ఆనందం నెలకొంది.ఇంతకాలం రాజధాని నిర్మాణంపై జగన్ నిర్లక్ష్యం చూపుతున్నారనే భావనలో ఉన్న కొందరు రైతులు… ఆయన తీసుకున్న తాజా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో టీడీపీ కూడా ఫుల్ హ్యాపీగా ఉందని తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని పట్టించుకోవడం లేదని ఆరోపించిన టీడీపీ… ఏపీ రాజధాని అమరావతిపై క్లారిటీ ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే వైసీపీ మాత్రం అమరావతిని రాజధాని కొనసాగించే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.