మేయర్ సందీప్ జోషికి తప్పిన ప్రమాదం.

0
46

మేయర్ సందీప్ జోషికి పెనుప్రమాదం తప్పింది. తన స్నేహితుడు పెళ్లి రోజు వేడుకలో పాల్గొనేందుకు సందీప్ జోషి మంగళవారం నాగ్ పూర్ లోని ఓ రెసారెంట్ కు వెళ్ళాడు అనంతరం తన కుటుంభ సభ్యులతో కలిసి కారులో ఇంటికి బయల్దేరాడు. గుర్తు తెలియని దుండగులు తన కారుపై కాల్పులుజరిపారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ… కారు డ్రైవర్‌ సీటు, ఆ వెనుక సీటు అద్దాల్లో బుల్లెట్లు దిగాయని పేర్కొన్నారు. అయితే సందీప్‌ జోషి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదన్నారు. లేదంటే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మేయర్‌ వాహనంపై కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా బీజేపీకి చెందిన సందీప్‌ జోషికి గతంలో పలు బెదిరింపు లేఖలు వచ్చాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో కొంతమంది వ్యక్తులు ఆయనను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇక గత నెలలో ఆయన కారు చోరీకి గురైంది. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.