రైతుల ధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.

0
41

ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుళ్ళూరులో భారీగా పోలీసుల మొహరించారు. ధర్నా చేసేందుకు తుళ్లూరులో టెంటు వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది.  మరోవైపు సచివాలయంకు వెళ్లే ప్రతి వ్యకిని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఆధార్ కార్డులో అడ్రెస్ లను కూడా తనిఖీ చేస్తున్నారుజ దీంతో పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు మందడం ప్రధాన రహదారిపైనా ధర్నా నిర్వహించేందుకు రైతులు సిద్ధపడ్డారు. సచివాలయానికి వెళ్లే మార్గం కావడంతో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.గుంటూరు జిల్లా తుళ్లూరులో అరగుండు, అరమీసాలు గీయించుకొని రైతులు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.మరోవైపు రాజధానిని రాజస్థాన్ ఏడారితో పోల్చిన స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపై కూడా రైతులు మండిపడుతున్నారు. ఇక్కడ పండిస్తున్న పంటలు స్పీకర్‌ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మహాధర్నాకు రావాలని 29 గ్రామాల ప్రజలకు రైతులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి.. రైతుల ధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.