న్యూ ఇయర్ సందర్భంగా RRR చిత్రానికి సంబంధించిన ఒక అప్‌డేట్.

0
56

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి  ఇద్దరు బడా మాస్ హీరోలతో.. అదీ చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ యాక్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్ లేదు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు సంబంధించిన లుక్‌తో పాటు ఈ చిత్ర టైటిల్ అఫీషియల్‌గా ప్రకటించే అవకాశాలున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు జనవరి 1 నుంచి వచ్చే ప్రతి పండగ రోజున ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వనున్నడట.

ఇక  ఈ సినిమా టైటిల్ కోసం ఇప్పటికే రాజమౌళి ప్రేక్షకులను ఓ పోటీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ‘ఆర్ఆర్ఆర్’ వర్కింగ్ టైటిల్‌కు సరిగ్గా సరిపోయేలా పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర టైటిల్స్  ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.అంతేకాదు ఇప్పటికే  ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.