పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాల చేస్తున్న రాద్ధాంతాన్ని, ఆందోళనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. CAA అమలు విషయంలో ఇంచు కూడా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. జోధ్‌పూర్ (రాజస్ధాన్)లో జరిగిన CAA, NRCకి మద్దుతుగా జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అమిత్ షా. పౌరసత్వ చట్టం విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి.. ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంపై బురదజల్లుతూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు అమిత్ షా.
పొరుదేశాల నుంచి వచ్చిన పీడిత మైనార్టీ శరణార్థులకు పౌరసత్వం కల్పించడమే ఉద్దేశ్యమని.. అంతేతప్ప ఎవరి పౌరసత్వాన్ని CAA లాక్కోదని క్లారిటీ ఇచ్చారు అమిత్ షా. పక్క దేశాల్లో మతపరమైన పీడనను తట్టుకోలేక భారత్‌కు వచ్చిన ముస్లీమేతర శరణార్థులను ఆదుకోవాల్సిన అసవరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక CAAపై విమర్శలు మానుకొని.. కోటాలో చనిపోతున్న పసిపిల్లల మరణ మృదంగంపై దృష్టి సారించాలని రాజస్థాన్ రాజస్థాన్ కు చురకలంటించారు అమిత్ షా.