పుల్వామా బాధిత కుటుంబాలకు అండగా వుంటాం: రిలయన్స్ ఫౌండేషన్

0
33

జమ్ముకశ్మీర్‌లో పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్ల పై దాడికి జరిగింది. ఐఈడీతో ఆత్మాహుతి దాడికి తెగబడటంతో దాదాపు 44 మంది జవాన్లు అమరులయ్యారన్న విషయం తెలిసిందే. ఈ విషాదం జరిగిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చి పుల్వామా బాధిత కుటుంబాలకు ఎంతో కొంత డొనేట్ చేస్తున్నారు.

అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు సిద్ధమని రిలయన్స్ గ్రూప్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మరింత మెరుగైన చికిత్స అవసరమని భావిస్తే తమ ఫౌండేషన్ కు చెందిన ఆసుపత్రులకు వారిని తరలించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా హామీ ఇచ్చారు.

: @relianceindustrieslimited with @reliancefoundation are reaches out for help to the families of martyrs of Pulwama attack.