“గల్లీ బాయ్” సూపర్: హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్

0
46

ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ర్యాపర్ గా నటించిన గల్లీబాయ్ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. రణ్ వీర్ సింగ్, అలియా భట్ జోడి గా నటించిన గల్లీబాయ్ సినిమా రీసెంట్ గా విడుదల అయింది. ఓ యువ గాయకుడు తన కలలను ఎలా నిజం చేసుకున్నాడన్న నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా గురించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భం గా హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ఈ సినిమాపై స్పందిస్తూ..హీరో రణ్ వీర్ సింగ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు.

‘యో.. రణ్ వీర్ సింగ్. కంగ్రాట్స్. నువ్వు గల్లీబాయ్ లో చేసిన నటన నాకు చాలా బాగా నచ్చింది. హిప్ హాప్ ను ప్రపంచవ్యాప్తంగా చూడటం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ మ్యాన్’ అంటూ ఓ వీడియో చేసి దానిని ఇంస్టాగ్రామ్ స్టోరీ గా పెట్టారు.