నగరంలో కలకలం రేపుతున్న డిగ్రీ కాలేజ్ సినిమా పోస్టర్లు..

0
61

డిగ్రీ కాలేజ్ సినిమా పోస్టర్లు హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతున్నాయి. సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్ కావడంతో ఇప్పుడు ఆ సినిమా పోస్టర్లు సైతం కలంకలం రేపుతున్నాయి. తాజాగా ఈ సినిమా పోస్టర్లు నగరంలోని పలు బస్టాపుల్లో వెలిశాయి. దీంతో మహిళలు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే డిగ్రీ కాలేజ్‌ సినిమా పోస్టర్లు అశ్లీల సన్నివేశాలతో అసభ్యంగా ఉన్నాయని, యువతను చెడుమార్గంలో తీసుకువెళ్లేలా పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విద్యార్థి, యువజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే డిగ్రీ కాలేజీ సినిమాలో ఉన్న అశ్లీల దృశ్యాలను వెంటనే తొలగించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో టైటిల్‌ అభ్యంతరంగా ఉండటంతో పాటు విజ్ఞానానికి కేంద్రమైన తరగతి గదిలో అశ్లీల కార్యకాలపాలు జరుతున్నట్లు చిత్రీకరించడం ద్వారా, విద్యావ్యవస్థను తీవ్రంగా అవమానపరిచారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఇప్పటికే విద్యార్థి, యువజన సంఘాల నుంచి సెన్సార్‌ బోర్డు, సిటీ పోలీస్‌ కమిషనర్‌, ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అశ్లీల దృశ్యాలను తొలగించాలని లేనిపక్షంలో సినిమాను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.