శివరాత్రి పర్వదినాన ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన శిల్పా శెట్టి.

0
40

బాలీవుడ్ ‘సాగరకన్య’ శిల్పా శెట్టి పండంటి ఆడపిల్లకు తల్లయ్యారు. అయితే పాపను ఆమె నవమాసాలు మోసి కనలేదనుకోండి. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా రాజ్‌కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు ఆడపిల్లకు తల్లిదండ్రులయ్యారు. శివరాత్రి పర్వదినాన లక్ష్మిదేవి వాళ్లింట్లో అడుగుపెట్టిందనే చెప్పాలి. పాపకు సమీషా అని నామకరణం చేసినట్లు శిల్పా శెట్టి వెల్లడించారు. ఆ పేరుకు అర్థం కూడా వివరించారు. స అంటే సంస్కృతంలో ‘పొందినది’ అని, మీషా అంటే రష్యన్ భాషలో దేవుడితో సమానం అని తెలిపారు. అయితే పాప ఫిబ్రవరి 15న జన్మించిందట. కానీ శివరాత్రి రోజున ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.


వీరికి వియాన్ అని ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లై, పిల్లాడు పుట్టాక శిల్ప పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించి వాటిని చూసుకునేవారు. చాలా కాలం తర్వాత శిల్ప మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమా ‘హంగామా 2’. ఇందులో పరేష్ రావల్, మీజాన్ జాఫ్రే,ప్రణీతా సుభాష్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.