టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. మరో సీనియర్ బెంగాలీ నటుడు సంతు ముఖర్జీ (60) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసారు. ఇక బెంగాలీ సినీ ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. ఈయన గుండెపోటుతో బుధవారం రాత్రి దక్షిణ కోల్‌కోతాలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1951లో కోల్‌కతాలో జన్మించిన సంతు ముఖర్జీ యంగ్ ఏజ్‌లోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సంసార్ సిమాంటే, రాజా, భాలోబాసా వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు టీవీ సీరియల్స్‌లో పెద్ద తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తనదైన పాత్రలతో అలరించిన ఈయన గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలో రక్తపోటు పెరగడంతో పాటు హైపర్ టెన్షన్‌కు గురికావడంతో ఫిబ్రవరి 4న సంతు ముఖర్జీని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స తర్వాత గతవారమే ఇంటికి తీసుకుపోగా.. బుధవారం కన్నుమూసారు. సంతుకు ఇద్దరు కూతుళ్లు స్వస్థిక ముఖర్జీ, అజోసా ముఖర్జీ ఉన్నారు.వీరిలో స్వస్థిక ముఖర్జీ నటిగా రాణిస్తోంది. మరో కూతురు అజోపా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. సంతు ముఖర్జీ మరణం పట్ల బెంగాల్ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మరణం పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -