లాక్ డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో పార్లేజీ బిస్కెట్ అమ్మకాలు.

0
97

కరోనా లాక్‌డౌన్‌లో ఎన్నో సంస్థలు నష్టాలు చవిచూశాయి. నిత్యావసర వస్తువులకు తప్ప మిగతా వస్తువులను డిమాండ్ పడిపోయింది. ఐతే కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ పార్లేకు కరోనా కాలం కలిసివచ్చింది. లాక్ డౌన్ సమయంలో పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. కంపెనీ ప్రారంభమైన 1938 నుంచి ఇప్పటి వరకు, ఇంత భారీ మొత్తంలో ఎప్పుడూ అమ్మకాలు జరగలేదని పార్లే ప్రతినిధులు చెప్పారు. గత 8 దశబ్దాల కాలంలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలోనే అత్యధిక సేల్స్ నమోదయినట్లు వెల్లడించారు.

లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత కేవలం నిత్యావసర వస్తువులను తయారుచేసే ఫ్యాక్టరీలు, దుకాణాలు మాత్రమే నడిచాయి. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన వెంటనే పార్లేజీ బిస్కెట్ల ఉత్పత్తిని పెంచారు. సిబ్బందికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి ఎక్కడా సప్లై చైన్‌కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. అటు లాక్‌డౌన్ చాలా మంది పేదలు ఆకలితో అలమటించారు. వారిలో చాలా మంది తక్కువ ధరకే లభించే పార్లేజీ బిస్కెట్లను కొని ఆకలి తీర్చుకున్నారు. దాతలు సైతం పెద్ద మొత్తంలో పార్లేజీ బిస్కెట్లను కొని పేదలకు పంచారు. అటు వలస కార్మికులు కూడా పార్లేజీ బిస్కెట్లతోనే తమ కడుపు నింపుకున్నారు.

రూ.5కే పార్లేజీ బిస్కెట్స్ లభిస్తున్నాయని.. ఇది కామన్ మాన్ బిస్కెట్ అని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. పార్లేజీ కంపెనీ ప్రతి రోజు 40 కోట్ల బిస్కెట్లు తయారుచేస్తుంది. ఒక నెలలో తయారయ్యే పార్లేజీ బిస్కెట్లను పేర్చుకుంటూ వెళ్తే భూమి, చంద్రుడి మధ్య దూరాన్ని కవర్ చేయవచ్చు. అంతేకాదు ఒక ఏడాదిలో తయారయ్యే బిస్కెట్లతో భూమి చుట్టూ 192 రౌండ్లు వేయవచ్చని ప్రచారంలో ఉంది. కిలో బిస్కెట్లను రూ.77కే అమ్ముతుండడంతో అందరికీ పార్లేజీ చేరువయిందని కంపెనీ ప్రతిధులు చెబుతున్నారు. లాక్‌డౌన్ అమ్మకాలతో పార్లేజీకి ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితమైందని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో పార్లే కంపెనీకి చెందిన క్రాక్ జాక్, మొనాకో, హైడ్ అండ్ సీక్‌తో పాటు బ్రిటానియా కంపెనీకి చెందిన గుడ్‌డే, టైగర్, మిల్క్ బికీస్, బార్బన్ అండ్ మారీ బిస్కెట్లు కూడా భారీగా అమ్ముడయ్యాయని మార్కెట్ నిపుణులు చెప్పారు.