బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేసినా.. పలువురు సిని, దర్శక నిర్మాతలు.

0
64

నందమూరి నట సింహాం బాలకృష్ణకు ఆయన తోటి హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు సిని, దర్శక నిర్మాతలు బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేసినా.. చిరంజీవి నా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బాలయ్యకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. 60లో అడుగుపెడుతోన్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలన్నారు. అంతేకాదు అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. ఇక వీళ్లిద్దరు టాలీవుడ్‌కు సంబంధించిన విషయాల్లో కొన్ని మనస్పర్ధలు ఉన్న.. వ్యక్తిగతంగా మంచి స్నేహితులమని పలు సందర్భాల్లో ఇరువురు హీరోలు ఎపుడు చెబుతూ ఉంటారు. వీళ్లెపుడు కలిసిన చిరునవ్వుతో పలకరించుకుంటు ఉంటారు.

గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరి మధ్య టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బేదాభిప్రాయాలు ఉన్నా.. అవేమి మనసులో పెట్టుకోకుండా.. చిరంజీవి.. బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేయడంతో టాలీవుడ్‌లో వీళ్లిద్దరి మధ్య నెలకొన్న మనస్పర్ధలకు చెక్ పెట్టినట్టైయింది. అంతేకాదు బాలయ్య తన మధ్య ఎలాంటి వ్యక్తిగత శతృత్వం లేదని చిరంజీవి తన ట్వీట్‌తో స్పష్టం చేసారు. మొత్తంగా బాలయ్యకు చిరంజీవి బర్త్ డే విషెస్ తెలియజేయడం వెరీ స్పెషల్ అనే చెప్పాలి.  గత కొన్ని రోజులుగా ఇరువురు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ట్విట్టర్‌లో బాలయ్య పుట్టినరోజు టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోంది.