మోదీకి తెలిసే పుల్వామా దాడి జరిగింది.. ఏదో మతలబు వుంది

0
40

పుల్వామా దాడి నేపథ్యంలో కేంద్రంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి కేంద్రానికి తెలిసే జరిగిందని విమర్శించారు. కేంద్రానికి తెలిసే ఈ దాడి జరిగిందని చెప్పేందుకు తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని మమత పేర్కొన్నారు. ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రధాని జవాన్లను వాయు మార్గంలో ఎందుకు తరలించలేదని సూటిగా ప్రశ్నించారు. ఐదేళ్లుగా జరగనిది ఎన్నికలకు కొద్ది రోజులు జరిగితే ఏమని అర్థం చేసుకోవాలన్నారు. ఇందులో ఏదో మతలబు ఉండే ఉంటుందని మమత అనుమానం వ్యక్తం చేశారు. నిఘా నివేదికలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉగ్రవాదులను భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌పై ఇన్నాళ్లూ ఎందుకు మౌనం వహించారని మోదీని నిలదీశారు. ఎన్నికలకు ముందే ఈ దాడి ఎందుకు జరిగిందని ప్రశ్నించిన మమత.. రాజకీయ ప్రయోజనాల కోసం పాక్‌పై పరోక్ష యుద్ధానికి కేంద్రం తెరలేపిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ మార్క్ రాజకీయానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని విరుచుకుపడ్డారు.