కేఏ పాల్ అమ్మాయిలపై చేతులేసి.. తాకరాని చోట తాకుతాడు.

0
70

కేఏ పాల్‌పై యాంకర్ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని శ్వేతా రెడ్డి మండిపడింది. హిందూపురం సీటుకు డబ్బులు డిమాండ్ చేశాడని ఫైర్ అయ్యింది. ప్రజాశాంతి పార్టీతో ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్న కేఏ పాల్‌కు శ్వేతారెడ్డి వ్యాఖ్యలు గట్టి ఎదురు దెబ్బ కొట్టేలా చేశాయి. ఇటీవలే ఆ పార్టీలో చేరి, కొన్నిరోజులకే దూరం జరిగిన టీవీ యాంకర్ శ్వేతారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేఏ పాల్ ఓ కామాంధుడని, అమ్మాయిలపై చేతులేసి తాకరాని చోట తాకుతుంటాడని అన్నారు. అనంతపురం పర్యటనలో తనతో ఓసారి ఇలాగే బిహేవ్ చేస్తే గట్టిగా హెచ్చరించానని వెల్లడించారు. అప్పట్నించి తనజోలికి రాలేదని, కానీ ఇతర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని వివరించారు. తనకు హిందూపురం టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ డబ్బులిస్తేనే టికెట్ అంటూ మెలిక పెట్టారని శ్వేతారెడ్డి ఆరోపించింది. అటు, శ్వేతారెడ్డి ఆరోపణలకు కేఏ పాల్ కూడా అదేస్థాయిలో స్పందించారు. శ్వేతకు చాలామందితో సంబంధాలున్నాయని, ఆమె క్యారక్టర్ బాగాలేదని మొదట్లోనే గుర్తించామన్నారు.