ఆనందంతో పొంగిపోనా ?? గుచ్చితే కుంగిపోనా ?? : కవి హృదయం
అనుకోని అదృష్టం కాళ్ళ దగ్గరికి వచ్చింది
అనుకున్న పనులు వాయిదాపడి విసుగొచ్చింది
విడిచి వెళ్ళిన మనిషి తిరిగొచ్చి హాయినిచ్చింది
వస్తూనే మానని గాయాలను విరగగుచ్చింది
అదృష్టానికి ఆనందంతో పొంగిపోనా..?
వచ్చి గాయాలను గుచ్చితే కుంగిపోనా..?
రచన: సందీప్ కిలాడి
మౌనమే అంతరంగం… కవి హృదయం
నీ మౌనం నా మదికి అంగీకారమే
ప్రకృతిని పలకరిస్తూ మనస్సును పులకరింపజేస్తుంది నీ మౌనం
లోకంలో గొప్పగొప్పవన్నీ మాట్లాడేది మౌనంతోనేగా
గలగలా పారే సెలయేరు
ప్రపంచానికి వెలుగునిచ్చే సూరీడు
చల్లగా పలకరించే పిల్లగాలి
వెచ్చని వెన్నెల అన్నీ మౌనంతో పాలకరించేవేగా
రచన: రంజిత్...
నా మాటల వెనుక ఎంతో అర్థం ఉంటే….
నా మాటల వెనుక ఎంతో అర్థం ఉంటే
నా మౌనం వెనుక ఇంకెంతో నిగూఢ అర్థం దాగి ఉంటుంది..
నా అక్షరాలే సాక్ష్యాలుగా నిలిచిపోతూ ఉంటే
నాది కాని నాతో ప్రయాణించే కాలం నన్నే దోషిని చేస్తుంది..
-...
#స్త్రీ .. నువ్వు కూర్చున్న చెట్టుని …. నువ్వే నరుక్కుంటున్నావ్
#స్త్రీ
బీజమే వేరులై
భూమి చీల్చుకొని పుట్టి
మొక్కై, చెట్టై, కొమ్మై....
నువ్వు ఏడ్చేవేళ
లాలిపాడే చల్లని చిరుగాలై,
తప్పటడుగులు వేసే నిన్ను
కొమ్మై వంగి నడిపించే శక్తి మయమై,
నీకు ఆకలేస్తే అన్నమై,
ఒక్కోక్క అడుగు ఎదిగే నిన్ను చూసి
గర్వంగా తలెత్తుకు నిలిచే ఆనందమై,
నీ...
ఓ స్త్రీ నీకు వందనం..
స్త్రీ.. బీజమే వేరులై
భూమి చీల్చుకొని పుట్టి
మొక్కై, చెట్టై, కొమ్మై….
నువ్వు ఏడ్చేవేళ
మరణమా…? కవి హృదయం
మరణమా...?
మరణం నాకెప్పుడూ ఆనందమే
నా రాక కోసం అణునిత్యం ఎదురుచూస్తున్న గొప్ప మిత్రుడు మరణం
ఎంతోమందిని వదిలివెళ్లినా తనలో ఐక్యం చేసుకుంటూ లాలిస్తుంది మరణం
ఇక తన పరిచయంతోనే జీవిత గమ్యం ముగుస్తుందని గుర్తుచేస్తుంది మరణం
బతుకంతా పోరాడింది...
భారమైన మనసుతో : కవి హృదయం
భారమైన మనసుతో కదలని నా కలం
చేరువైన దుఃఖంతో సంసారమే నా బలం
ఎందుకో తెలియదు సతమతం అవుతుంది నా హృదయం
కేవలం రోజుల జ్ఞాపకాలతో మిగిలిన కాలం ఇక హృద్యం
రచన: సందీప్ కిలాడి